ఆధ్యాత్మికత

Ayyappa Pooja: శబరిమలను తలపించిన శంభీపూర్! వేల మంది స్వాములతో మహాపడి పూజ

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అరుణ్ గురుస్వామి అధ్వర్యంలో జరిగిన పూజలో భక్తులు మైమరిచిపోయారు.

భక్తిమయంగా మారిన ఎమ్మెల్సీ నిలయం

బీఆర్ఎస్ నేతల రాకతో కోలాహలం

కరువు ఛాయలు రాకుండా ఉండాలని అయ్యప్పకు వేడుకోలు

కన్నెస్వామిగా రాజు పూజలు.. హిందూ సమాజానికి ఆదర్శమంటున్న నేతలు

Ayyappa Pooja: తెలంగాణ ఏర్పడేంత వరకు శంభీపూర్ లో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనని భీష్మించి కూర్చున్న 23ఏళ్ల సుంకరీ రాజు భక్తితో ఉద్యమాన్ని చాటి చెప్పారు. 20ఏళ్ల తర్వాత ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని ఎమ్మెల్సీగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలో కరువు ఛాయలు లేకుండా చూడాలని అయ్యప్ప మాల ధరించారు. కన్నెస్వామిగా శబరిమలలో ఎలా అయితే మండపాలు ఉంటాయో అలానే తాత్కాలిక మండపాలతో మహా పడి పూజ నిర్వహించారు. సుమారు 4వేల మంది అయ్యప్ప స్వాములు, 2వేల మంది భక్తులతో పూజ ఘనంగా నిర్వహించారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అరుణ్ గురుస్వామి అధ్వర్యంలో జరిగిన పూజలో భక్తులు మైమరిచిపోయారు. స్వాములకు భిక్ష పెట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని దైవాన్ని ప్రార్థించారు. కేసీఆర్ చేసిన పూజలను చూసి తాను పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాని తెలిపారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ అయ్యప్ప స్వామి మహా పడిపూజలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, శ్రీనివాస్ యాదవ్, గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్సీలు నవీన్ రావు, దాసోజు శ్రవణ్, బండారు ప్రకాశ్, రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్.. మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, గ్యాదరి కిశోర్, పట్నం నరేందర్ రెడ్డి.. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డి.. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ సభ్యుడు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లు, ఏరోళ్ల శ్రీనివాస్.. మెదక్, పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి, ఆదర్శ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ స్థానిక నేతలు పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు.

తర్వాత చదవండి