International

Trump Tariffs : ఇండియాకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్

భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు. 7 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం వరకు కొత్త టారిఫ్స్ విధించాలని అమెరికా నిన్న ప్రతిపాదించింది. ఇతర దేశాల నుంచి చౌకగా అమెరికాలోకి వస్తువులు వస్తుండటంతో స్థానిక కంపెనీలు నష్టాల్లోకి వెళ్తున్నాయని, ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని భావించిన అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ట్రంప్ నిర్ణయంతో భారత్‌ సహా కంబోడియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్, థాయిలాండ్ వంటి దేశాలపై సుంకాల భారం పడనుంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) ఆఫీస్ రూపొందించిన ఈ ప్రతిపాదనను రాయిటర్స్ వెల్లడించింది. ఇదిలాఉండగా, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 40 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదన కూడా ఇందులో ఉందని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే భారతీయ వస్తువులపై సుంకం 17 శాతానికే పరిమితం కావచ్చని యూఎస్‌టీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.