సినిమా

Bandla Ganesh: చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు ఏడాది జైలు శిక్ష..

Bandla Ganesh: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే గణేశ్‌ నిర్మించిన ఆఖరి సినిమా. అయితే, తాజాగా బండ్ల గణేష్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఒంగోలు న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. ఈ వార్త టాలీవుడ్ సినీ పరిశ్రమలో గాట్ టాపిక్‌గా మారింది. గణేష్‌కు జైలు శిక్షతో పాటుగా రూ. 95 లక్షలు జరిమానాగా కూడా విధిస్తూ కోర్టు ఈ బుధవారం తీర్పునిచ్చింది.