సినిమా
Bhogi-Release Date: శర్వానంద్ ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ లాక్..
Bhogi-Release Date: పలుమార్లు వాయిదా పడిన శర్వానంద్ 'బోగి' సినిమాకి మేకర్స్ కొత్త విడుదల తేదీని లాక్ చేశారు. తాజాగా, ఆ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ను వదిలారు. టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా డింపుల్ హయాతి కీలక పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యలో నవంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
