Bhogi-Release Date: పలుమార్లు వాయిదా పడిన శర్వానంద్ 'బోగి' సినిమాకి మేకర్స్ కొత్త విడుదల తేదీని లాక్ చేశారు. తాజాగా, ఆ తేదీని ప్రకటిస్తూ పోస్టర్‌ను వదిలారు. టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా డింపుల్ హయాతి కీలక పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యలో నవంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
వాస్తవానికి, నవంబర్ 12నే భోగి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేకర్స్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పుడున్న భారీ పోటీ నేపథ్యంలో ఇక, ఈ ఏడాది భోగి సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతనే మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్టుగా చెప్పుకున్నారు.
కానీ, మేకర్స్ అంత దూరం వెళ్ళలేదు. ఇదే, నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక, టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన ఎస్వీసి సంస్థ ద్వారా రిలీజ్ చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది 'నారి నారి నడుమ మురారి', 'బైకర్' సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టాడు శర్వా. ఇక, ఇదే ఏడాది 'భోగి' కూడా రాబోతుంది కాబట్టి..ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా శర్వాకి హ్యాట్రిక్ హిట్ పడుతుందని నమ్మకంగా ఉన్నారు.
గత కొంతకాలంగా దర్శకుడు సంపత్ నందికి ఆశించిన విజయం దక్కలేదు. అందుకే, 'భోగి' సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి అన్నీ విధాలుగా శ్రమిస్తున్నాడు. హీరోహీరోయిన్ల పాత్రలు సినిమాకి మేయిన్ హైలెట్‌గా నిలవనున్నాయి. అంత ఎమోషనల్ కంటెంట్‌ను రాసుకున్నాడు సంపత్ నంది. ముఖ్యంగా, ఇంట్రవెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎవరి ఊహకి అందని రీతిలో తీర్చిదిద్దుతున్నాడు. సర్ప్రైజ్తో పాటు థ్రిల్ ఫీలవుతారని చిత్రబృందం చాలా బలంగా నమ్ముతోంది. పీరియాడిక్ కథాంశంతో అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ మిళితమై కథ సాగుతుందని తెలుస్తోంది. కాగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
