వ్యాపారం
Bisleri water: ‘బిస్లరీ’ వాటర్ తాగే వారికి షాక్.. ల్యాబ్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు!
ప్రముఖ బ్రాండ్ 'బిస్లరీ' (Bisleri) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై తీవ్ర వివాదం నెలకొంది. బిస్లరీ వాటర్ నమూనాలు తాగడానికి సురక్షితం కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా స్పష్టం చేసింది. బిస్లరీ తయారీ ప్రాంగణం నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా, నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి 'బ్రోమేట్' (Bromate) రసాయనం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఫలితాలపై బిస్లరీ సంస్థ అప్పీల్ చేయడంతో ఫుడ్ ల్యాబ్లో మరోసారి పునఃపరీక్షలు నిర్వహించగా, అందులోనూ నీరు సురక్షితం కాదని, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
