National

Bisleri Water: బిస్లరీ వాటర్‌లో విషం.. మరి మిగతా వాటి సంగతేంటి?

Bisleri Water: బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా కళ్లు మూసుకుని నమ్మేది బ్రాండెడ్ వాటర్ బాటిల్‌నే. అందులోనూ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు 'బిస్లరీ'. స్వచ్ఛతకు, ఆరోగ్య భద్రతకు మారుపేరుగా నిలిచిన ఈ పెద్ద కంపెనీ అమ్మే తాగునీటి నాణ్యతపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. బిస్లరీ వాటర్ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారక కెమికల్స్ ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో తేలడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) అధికారులు ఇటీవల బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ నుంచి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్‌ను సేకరించి టెస్టులకు పంపారు. మొదటి టెస్టులో ఆ నీటిలో 'బ్రోమేట్' స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఆ నీరు తాగడానికి ఏమాత్రం సేఫ్ కాదని అధికారులు ప్రకటించారు.