జాతీయం

Bisleri Water: బిస్లరీ వాటర్‌లో విషం.. మరి మిగతా వాటి సంగతేంటి?

Bisleri Water: బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా కళ్లు మూసుకుని నమ్మేది బ్రాండెడ్ వాటర్ బాటిల్‌నే. అందులోనూ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు 'బిస్లరీ'. స్వచ్ఛతకు, ఆరోగ్య భద్రతకు మారుపేరుగా నిలిచిన ఈ పెద్ద కంపెనీ అమ్మే తాగునీటి నాణ్యతపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది.

Bisleri Water: బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా కళ్లు మూసుకుని నమ్మేది బ్రాండెడ్ వాటర్ బాటిల్‌నే. అందులోనూ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు 'బిస్లరీ'. స్వచ్ఛతకు, ఆరోగ్య భద్రతకు మారుపేరుగా నిలిచిన ఈ పెద్ద కంపెనీ అమ్మే తాగునీటి నాణ్యతపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. బిస్లరీ వాటర్ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారక కెమికల్స్ ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో తేలడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

రెండుసార్లు ఫెయిల్ అయిన నీటి శాంపిల్స్!

భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) అధికారులు ఇటీవల బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ నుంచి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్‌ను సేకరించి టెస్టులకు పంపారు. మొదటి టెస్టులో ఆ నీటిలో 'బ్రోమేట్' స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఆ నీరు తాగడానికి ఏమాత్రం సేఫ్ కాదని అధికారులు ప్రకటించారు.

మొదటి రిపోర్టుపై బిస్లరీ సంస్థ అప్పీల్ చేసుకోవడంతో, ఆ శాంపిల్‌ను తదుపరి పరీక్షల కోసం రిఫరల్ ఫుడ్ లాబరేటరీకి పంపించారు. కానీ అక్కడ చేసిన రెండో విడత టెస్టుల్లోనూ బిస్లరీ నీరు సేఫ్ కాదని తేలిపోయింది. ఈసారి నీటిలో 'పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్' అనే ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

క్యాన్సర్ కారక కెమికల్స్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ క్రిమినల్ యాక్షన్!

బిస్లరీ నీటిలో బయటపడిన బ్రోమేట్, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కెమికల్స్‌ను డాక్టర్లు 'కార్సినోజెన్స్'గా చెబుతారు. అంటే ఇవి శరీరంలో క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ప్రమాదకర పదార్థాలు. సాధారణంగా నీటిని శుద్ధి చేసే ప్రాసెస్‌లో లోపాలు జరిగినప్పుడు ఇలాంటి కెమికల్స్ నీటిలో చేరే అవకాశం ఉంటుంది. రెండు ల్యాబ్ రిపోర్టుల్లోనూ రూల్స్ ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో, బిస్లరీ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది.

పెద్ద బ్రాండ్ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా వాటి సంగతేంటి?

సాధారణంగా లీటర్ నీళ్ల బాటిల్‌కు రూ.20 పెట్టి కొనేది కేవలం స్వచ్ఛత, ఆరోగ్య భద్రత కోసమే. అలాంటిది దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే నంబర్ వన్ బ్రాండ్ 'బిస్లరీ' నీళ్లలోనే హానికర కెమికల్స్ బయటపడటం సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న బ్రాండెడ్ నీటి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్న లోకల్ వాటర్ బాటిళ్లు, ప్యాకెట్ల సంగతేంటనే ప్రశ్న ఇప్పుడు అందరినీ భయపెడుతోంది.

తర్వాత చదవండి