చిత్రం లేదు
తెలంగాణBMSandeep: కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని నేతకు తెలంగాణ బాధ్యతలు.. కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహం ఏంటి?
BMSandeep: దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గతంలో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మాణిక్యం ఠాగూర్ వంటి ఉద్దండులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసిన కీలక రాష్ట్రమిది. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం కర్ణాటకకు చెందిన యువ నేత బి.ఎం. సందీప్‌ను నియమించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, సచిన్ పైలట్, అజయ్ మాకన్ వంటి సీనియర్ల పేర్లు రేసులో వినిపించినప్పటికీ.. కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని నేతకు ఏఐసీసీ పగ్గాలు అప్పగించడం వెనుక అసలు వ్యూహం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.
