తెలంగాణ

BRS Party: గులాబీ దళం సరికొత్త ప్లాన్! ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక టీమ్!

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. చలికాలంలోనూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. అయితే ఇన్ని రోజులు ప్రత్యర్థుల విమర్శలను మౌనంగా భరించిన బీఆర్ఎస్, ఇప్పుడు తన రూట్ మార్చింది. ఇకపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వదిలిపెట్టకూడదని, వెంటనే 'మాటకు మాట' బదులు ఇవ్వాల్సిందేనని గులాబీ దళం గట్టి నిర్ణయానికి వచ్చింది. దీనికోసం పార్టీ అధిష్ఠానం ఒక ప్రత్యేక 'కౌంటర్ టీమ్'ను రంగంలోకి దించుతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.