తెలంగాణ
TG: కంటోన్మెంట్ బోర్డులో సీబీఐ అలజడి.. టౌన్ ప్లానింగ్ విభాగంలో కలకలం!
TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై గత వారం రోజులుగా సీబీఐ బృందం ఆరా తీస్తుండటంతో కంటోన్మెంట్ ఆఫీసులో కలకలం మొదలైంది.కంటోన్మెంట్ ఏరియాలో బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కొందరు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఫిర్యాదుదారులు నేరుగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, గత వారం రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు.
