ఏపీ
హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కీలక భేటీ!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఎన్డీఏ (NDA) నాయకత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇద్దరు నేతలు హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెల 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నవంబర్ 30న లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ఎన్డీఏ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర నాయకత్వం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అమలుతో ముడిపడి ఉన్న బిల్లులపై కీలకంగా చర్చించనుంది.
