ఏపీ
AP: శ్రీవారికి రూ.207.6 కోట్ల బంగారు కానుక.. 121 కిలోల ఆభరణాలు సమర్పించిన చెన్నై దంపతులు!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన ఓ భక్త దంపతులు భారీ కానుకను సమర్పించారు. ఏకంగా రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దాతలు వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు ఈ ఆభరణాలను అప్పగించారు.
