తెలంగాణ
కేసీఆర్, జగన్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ ఒప్పందం
Cm Revanth: తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు దోచిపెడుతోందని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పదే పదే దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ను మేము అడ్డుకోలేదు అన్నట్లుగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు రేవంత్.
