తెలంగాణ

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై రేవంత్ వ్యాఖ్యలు అవాస్తవం!

పల్నాడు వాటర్ గ్రిడ్‌కు 2022లోనే అనుమతులు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని సోషల్ మీడియాలో కొందరు వివరణ ఇస్తున్నారు. 2022 ఫిబ్రవరి 16న జారీ చేసిన G.O.Rt.No.56 రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పనులకు ఇచ్చిన పరిపాలనా అనుమతులకు సంబంధించినదే తప్ప నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనకు సంబంధించినది కాదని పేర్కొంటున్నారు.