తెలంగాణ

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటునకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ లో అచ్చంపేటకు చేరుకుంటారు. అచ్చంపేటలో హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.