తెలంగాణ

Cm Revanth Reddy: రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటునకు శంకుస్థాపన చేస్తారు.

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటునకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ లో అచ్చంపేటకు చేరుకుంటారు. అచ్చంపేటలో హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తన పర్యటనలో రూ.450 కోట్లతో నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ది పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.

శంకుస్థాపనల వివరాలు:

మద్దిమడుగులో…

* రూ.15 కోట్లతో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ ఏర్పాటుకు శంకుస్థాపన

* రూ.18 కోట్లతో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన

* రూ.38 కోట్లతో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అచ్చంపేట బహిరంగ సభ ప్రాంగణంలో..

* రూ.274.32 కోట్లతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీటీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన

* రూ.29.65 కోట్లతో నాగర్ కర్నూల్, పెద్ద కొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటునకు శంకుస్థాపన

* రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

* రూ.18.105 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

* రూ.14 కోట్లతో అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో నూతన ITDA భవన నిర్మాణానికి శంకుస్థాపన

* రూ.2 కోట్లతో అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన

తర్వాత చదవండి