తెలంగాణ

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష

Cm Revanth: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. సీఎంసీ పరిధిలో IIIT జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు కమిషనర్. డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు సీఎం రేవంత్.