తెలంగాణ

Cm Revanth: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ సూచించారు.

Cm Revanth: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. సీఎంసీ పరిధిలో IIIT జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు కమిషనర్. డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు సీఎం రేవంత్.

మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటుకు సూచన

ఫుట్ బ్రిడ్జి సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో PRTS (Persinal Rapid Transit System) ఫేజ్-1 కు సంబంధించి టెక్నో ఎకానమీ ఫీజిబిలిటీని సీఎంకు వివరించారు అధికారులు. కూకట్ పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు అలైన్ మెంట్ సాధ్యసాధ్యాలను సీఎంకు తెలిపారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్ బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్ మెంట్ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు అధికారులు.

PRTS డిపోల నిర్మాణానికి స్థలాల గుర్తింపు

నెక్లెస్ రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో PRTS డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. డిపో పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ

చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పురోగతిని సీఎంకు వివరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు కమిషనర్ రంగనాథ్. ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తర్వాత చదవండి