తెలంగాణ

Winter Cold : తెలంగాణలో పెరిగిన చలితీవ్రత.. వృద్ధులు, చిన్నారులకు అలర్ట్

రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మొన్నటివరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా ఇప్పుడు క్రమంగా పడిపోతున్నాయి. రోజంతా విపరీతమైన వేడి ఉన్నప్పటికీ రాత్రి సమయంలో చలి చంపేస్తోంది. ఉత్తర తెలంగాణలో తెల్లవారుజామున మంచు కురుస్తున్నట్టు సమాచారం.దీంతో ఉదయం పూట పనులకు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, రంగారెడ్డిలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వికారాబాద్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.