తెలంగాణ

Winter Cold : తెలంగాణలో పెరిగిన చలితీవ్రత.. వృద్ధులు, చిన్నారులకు అలర్ట్

రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మొన్నటివరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా ఇప్పుడు క్రమంగా పడిపోతున్నాయి. రోజంతా విపరీతమైన వేడి ఉన్నప్పటికీ రాత్రి సమయంలో చలి చంపేస్తోంది. ఉత్తర తెలంగాణలో తెల్లవారుజామున మంచు కురుస్తున్నట్టు సమాచారం.దీంతో ఉదయం పూట పనులకు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, రంగారెడ్డిలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వికారాబాద్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

అదేవిధంగా మహబూబ్‌నగర్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 25 జిల్లాల్లో 12 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకువస్తున్న ‘అక్వాన్’ తుఫాన్ కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎందుకంటే తుఫాన్ తన గమనాన్ని ఉత్తర ఏపీ-ఒడిశా వైపు మార్చుకోవడంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని, లేదంటే అది కూడా కురవకపోవచ్చని అంచనా వేసింది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి