తెలంగాణ
Congress Vs BRS: బరితెగిస్తున్న కాంగ్రెస్!.. భరిస్తున్న తెలంగాణికం
హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితేనే తన కుటుంబం మనుషులకు జరిగినట్లు ఫీల్ అయి కాపాడడం తెలంగాణ కల్చర్. కానీ, దాడులతో ఆ కల్చర్‌ను కాంగ్రెస్ నేతలు పాడు చేస్తున్నారు. సమాజం స్పృహ నూరిపోసిన వారిని ప్రొత్సహించిన సీఎం రేవంత్ రెడ్డి , దాడులను సైతం వెనకేసుకొస్తున్నారు. పైగా వాటిని ఉద్యమాల్లో జరిగిన దాడులతో పోల్చుతున్నారు. దీనిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ మెటా కంపెనీపై దాడి చేయడం, వాళ్లకు వెంటనే బెయిల్స్ ఇప్పించడం అంటే కార్పొరేట్ కంపెనీలు ఎందుకు? సెజ్ భూములు ఇవ్వడం ఎందుకు? ఆ యాక్ట్స్ ఎందుకు పనికి రావని చెబుతున్నారు. మెటా లాంటి సంస్థలోనే అలా జరిగితే రేపు అన్ని సాప్ట్వేర్ కంపెనీల్లో మోసాలు జరిగాయని ప్రతి ఒక్కరు దాడి చేయొచ్చు. చందాలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కోసం నేరుగా ఆఫీస్‌లకు వెళ్లొచ్చు.
