తెలంగాణ

Congress Vs BRS: బరితెగిస్తున్న కాంగ్రెస్!.. భరిస్తున్న తెలంగాణికం

హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితేనే తన కుటుంబం మనుషులకు జరిగినట్లు ఫీల్ అయి కాపాడడం తెలంగాణ కల్చర్. కానీ, దాడులతో ఆ కల్చర్‌ను కాంగ్రెస్ నేతలు పాడు చేస్తున్నారు. సమాజం స్పృహ నూరిపోసిన వారిని ప్రొత్సహించిన సీఎం రేవంత్ రెడ్డి , దాడులను సైతం వెనకేసుకొస్తున్నారు. పైగా వాటిని ఉద్యమాల్లో జరిగిన దాడులతో పోల్చుతున్నారు. దీనిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

  • ఉద్యమాన్ని, దాడులతో పోల్చుకోవడంతో తీవ్రతరం?

  • బెంగాల్, బిహార్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా?

  • పెద్దల సభకు పంపితే చిల్లర వేషాలు వేస్తున్న అనిల్ కుమార్ యాదవ్?

  • ప్రతిపక్షాల ప్రశ్నలను తిప్పికొట్టడంలో విఫలం

  • ఏ పనైనా ఎవరేం చేయలేరనే బరితెగింపు ధోరణి

  • వీళ్ల ఒత్తిళ్లతో అధికారులకు కోర్టుల మొట్టికాయలు

  • బెయిల్ అయినా? వేల కోట్ల భూములు కొల్లగొట్టడంలోనైనా అదే తీరు?

  • కనీసం ఏపీలాగానైనా గొడవలను సృష్టించాలని ప్లాన్?

  • మొన్న మెటా ఆఫీస్ , నేడు హోటల్‌పై దాడులు?

  • రేపు ఎక్కడ ఏం చేస్తారోనని సోషల్ మీడియాలో విమర్శలు

  • తెలంగాణ కల్చర్‌కు విరుద్ధంగా చేస్తున్న కాంగ్రెస్ కల్చర్‌పై స్వేచ్చ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809.

పోరాటం వేరు.. పోకిరి దాడులు వేరు?

హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితేనే తన కుటుంబం మనుషులకు జరిగినట్లు ఫీల్ అయి కాపాడడం తెలంగాణ కల్చర్. కానీ, దాడులతో ఆ కల్చర్‌ను కాంగ్రెస్ నేతలు పాడు చేస్తున్నారు. సమాజం స్పృహ నూరిపోసిన వారిని ప్రోత్సహించిన సీఎం రేవంత్ రెడ్డి , దాడులను సైతం వెనకేసుకొస్తున్నారు. పైగా వాటిని ఉద్యమాల్లో జరిగిన దాడులతో పోల్చుతున్నారు. దీనిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ మెటా కంపెనీపై దాడి చేయడం, వాళ్లకు వెంటనే బెయిల్స్ ఇప్పించడం అంటే కార్పొరేట్ కంపెనీలు ఎందుకు? సెజ్ భూములు ఇవ్వడం ఎందుకు? ఆ యాక్ట్స్ ఎందుకు పనికి రావని చెబుతున్నారు. మెటా లాంటి సంస్థలోనే అలా జరిగితే రేపు అన్ని సాప్ట్‌వేర్ కంపెనీల్లో మోసాలు జరిగాయని ప్రతి ఒక్కరు దాడి చేయొచ్చు. చందాలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్‌ కోసం నేరుగా ఆఫీస్‌లకు వెళ్లొచ్చు. ఇలాంటి పోకిరి దాడులను ఉద్యమ దాడులతో పోల్చితే ఎలా? ఆనాడు లగడపాటి రాజగోపాల్ ఆఫీసులను ముట్టడించాం. బస్సులను తగలబెట్టారు. ఉద్యోగులు సైతం పెన్ డౌన్ చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన ఆంధ్రా వాళ్ల ఇళ్లు ముట్టడించి దాడులు చేశారు. కానీ, సెజ్ భూముల్లో కార్పొరేట్ కంపెనీలను ముట్టడించలేదు. ఆంధ్రా టీవీ ఛానల్స్‌ను సైతం ఏం చేయలేదు. స్టూడియోలోనే ప్రశ్నింశారు, నిలదీశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. సకల జనులు అసెంబ్లీని ముట్టడించడంతో ఆనాటి పాలకులు దిగొచ్చారు. కానీ, ఇప్పటి దాడులు చూస్తుంటే బీహార్, బెంగాల్ రాజకీయం గుర్తుకొస్తోంది.

ఏపీ ఫ్యాక్షన్‌లా తయారు చేయాలని ప్లానా?

ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఏపీ రాజకీయాలను చూసి తెలంగాణ ప్రజలు ఛీదరించుకున్నారు. ప్రభుత్వంలో ఉంటే ఏదైనా చేయొచ్చా అని విమర్శించారు. అలాంటి దాడులను మెటా నుంచి మొదలుకొని ఈనాడు హోటల్‌లో దాడి వరకు వచ్చింది. బీఆర్ఎస్ నేత క్రిశాంక్.. రాహుల్ గాంధీ బొమ్మకు భోజనం తినిపిస్తూ, ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆనాడు బీఆర్ఎస్ చేసిన పాపాలను ప్రజల ముందు పెట్టవచ్చు. ఒక్కొక్క మీటింగ్‌కి ఎంత ఖర్చు పెట్టారో, బీఆర్ఎస్ పత్రికా ప్రకటనలు ఏంటో, ప్రచారం చేసుకుంది ఎలానో, వేల కోట్ల ఖర్చుని బయట పెట్టి విన్నూత్న నిరసనలతో ఎండగడితే తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకుంటారు. కానీ, పోలీసులను కాదని వాళ్లకు చెడ్డపేరు వచ్చేలా లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు కలిగేలా వ్యవహరించడం ఏపీ తరహా ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించడమే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే ఎన్నికలను అలానే గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం అవుతోంది.

అన్నింట్లో బరితెగించి దోపిడీ

భూ సంస్కరణల పేరుతో తెలంగాణలో గత 10 ఏండ్లుగా దోపిడీ జరుగుతోంది. ఆన్ లైన్ పహాణీ నుంచి ఈనాటి భూ భారతి, యూఎల్సీ, అక్రమ నిర్మాణాల వరకు అన్ని దందాలే, కాంగ్రెస్ నేత చెబితే చాలు ఎలాంటి ఫైల్ అయినా క్లియర్ చేస్తామనే కోణంలో రెవెన్యూ , ఫైనాన్స్‌తో పాటు అనేక డిపార్ట్‌మెంట్లలో బరితెగించి దోచుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. పేదలకు మేలు చేసేది 10 శాతం అయితే వాళ్లు మేసేది 90 శాతం అని ఆధారాలతో అధికారులు ఏసీబీకి దొరికిపోతున్న తీరు చూస్తే తెలిసిపోతోంది. వారిపై కూడా ఏసీబీ లాంటి దాడులను, లోక్ పాల్ లాంటి యాక్ట్స్ వస్తే వీళ్ల బండారం మొత్తం బయట పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

తర్వాత చదవండి