ఏపీ

అక్వాన్ టెన్షన్.. 20వ తేదీన తీరాన్ని తాకనున్న తుపాను

Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాను బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. కాగా తీరానికి దగ్గరయ్యే కొద్దీ అక్వాన్ తుపాను బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నానికి నర్సాపూర్-పూరీ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశావైపుగా అక్వాన్ తుపాను పయనిస్తోందని.. దీంతో ఏపీకి తుపాను ముప్పు తప్పినట్లే అని అంటున్నారు.