ఏపీ

Cyclone Akvan: అక్వాన్ టెన్షన్.. 20వ తేదీన తీరాన్ని తాకనున్న తుపాను

అక్వాన్ తీవ్ర తుపాను బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. కాగా తీరానికి దగ్గరయ్యే కొద్దీ అక్వాన్ తుపాను బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నానికి నర్సాపూర్-పూరీ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాను బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. కాగా తీరానికి దగ్గరయ్యే కొద్దీ అక్వాన్ తుపాను బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నానికి నర్సాపూర్-పూరీ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశావైపుగా అక్వాన్ తుపాను పయనిస్తోందని.. దీంతో ఏపీకి తుపాను ముప్పు తప్పినట్లే అని అంటున్నారు.

అక్వాన్ తుఫాన్ తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అర్నబ్, మురసు అంత ప్రభావం అక్వాత్ తుపానుతో ఉండకపోవచ్చని అంటున్నారు. తుపాను ఎక్కడ తీరాన్ని దాటినా.. దాని ప్రభావంతో 19, 20వ తేదీలలో శ్రీకాకుళం నుండి బాపట్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

అటు.. అక్వాన్ తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచింది ఏపీ ప్రభుత్వం. ఉత్తర కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించబోతోందని.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు అధికారులు.

తర్వాత చదవండి