తెలంగాణ
Congress : కరువు మండలాల ప్రకటన ఓకే.. మారటోరియం అమలేది?
ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది 17 శాతం లోటు వర్షపాతం నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా అధికారికంగా ప్రకటించింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ఈ మేరకు జీవో ఎంఎస్ నం.3 జారీ చేసింది. అయితే, రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను (హైదరాబాద్, పెద్దపల్లి మినహా) 31 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే 111 మండలాల్లో తీవ్ర కరువు, 254 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా రేవంత్ సర్కార్ డిక్లేర్ చేసింది.సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చారు.
