National
Delhi pollution : ఢిల్లీ కాలుష్యం.. వాహనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (AQI) మరింతగా దిగజారింది. సాధారణంగా ఏక్యూఐ 0 నుండి 50 మధ్య ఉంటే మంచిది. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు. కానీ, ప్రస్తుతం ఢిల్లీలో సగటు ఏక్యూఐ సుమారు 236 నుండి 293 మధ్య నమోదవుతోంది. పూర్తి అధ్వాన్నంగా పరిస్థితులు మారాయి. సుప్రీంకోర్టు ఎన్నిమార్లు మొట్టికాయలు వేసినా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలైన పంజాబ్,ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థ్యాలను కాల్చడం మాత్రం ఆపడం లేదు. దీనికి తోడు ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఢిల్లీలో కాలుష్య కారకాలు విడుదల చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫలితంగా అక్కడ గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తోంది.
