జాతీయం

Delhi pollution : ఢిల్లీ కాలుష్యం.. వాహనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (AQI) మరింతగా దిగజారింది. సాధారణంగా ఏక్యూఐ 0 నుండి 50 మధ్య ఉంటే మంచిది. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు. కానీ, ప్రస్తుతం ఢిల్లీలో సగటు ఏక్యూఐ సుమారు 236 నుండి 293 మధ్య నమోదవుతోంది. పూర్తి అధ్వాన్నంగా పరిస్థితులు మారాయి.

దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (AQI) మరింతగా దిగజారింది. సాధారణంగా ఏక్యూఐ 0 నుండి 50 మధ్య ఉంటే మంచిది. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు. కానీ, ప్రస్తుతం ఢిల్లీలో సగటు ఏక్యూఐ సుమారు 236 నుండి 293 మధ్య నమోదవుతోంది. పూర్తి అధ్వాన్నంగా పరిస్థితులు మారాయి. సుప్రీంకోర్టు ఎన్నిమార్లు మొట్టికాయలు వేసినా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలైన పంజాబ్,ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థ్యాలను కాల్చడం మాత్రం ఆపడం లేదు. దీనికి తోడు ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఢిల్లీలో కాలుష్య కారకాలు విడుదల చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫలితంగా అక్కడ గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తోంది.

సీజేఐ కీలక వ్యాఖ్యలు..

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది.కాలుష్య నివారణకు BS-VI వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరింది. ఢిల్లీలో వీలైతే మొత్తం NCR పరిధిలో కేవలం BS-VI ఉద్గార ప్రమాణాలు ఉన్న వాహనాలను మాత్రమే నడపడానికి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నామని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ స్పష్టంచేశారు.

వాణిజ్య వాహనాలపై ఐదేళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని, భారీ డీజిల్ ట్రక్కులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి నగర సరిహద్దుల్లోనే గిడ్డంగులు (Warehouses) నిర్మించాలని సీజేఐ సూర్యకాంత్ సూచించారు. అక్కడి నుంచి కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసర వస్తువులను బ్యాటరీ లేదా కాలుష్య రహిత వాహనాల ద్వారా నగరంలోకి తరలించేలా రాబోయే ఐదేళ్లలో ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేశారు.

అయితే, పాత వాహనాలపై వెంటనే నిషేధం విధిస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన ధర్మాసనం.. ప్రస్తుతానికి ఎటువంటి తక్షణ ఆదేశాలు జారీ చేయలేదు. దీర్ఘకాలిక విధానంలో దీనిని పరిశీలిస్తామని వెల్లడించింది. అదేవిధంగా ఢిల్లీ-NCR ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలు (Status Reports) సమర్పించాలని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.కాగా, ఢిల్లీలో కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, పెద్దలు శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మున్ముందు పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తర్వాత చదవండి