Ap Assembly seats : డీలిమిటేషన్.. ఏపీలో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్రంలోని మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు పలు సవరణలు చేయగా కేంద్ర కేబినెట్ ఇప్పటికే దానికి ఆమోదం తెలిపింది. దీంతో మరోసారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది.దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు 543 నుంచి 850 (రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిదే ఏపీలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంటు సీట్లు కూడా పెరుగుతాయి. కేంద్రం ప్రభుత్వం ఈ సారి జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాదికి అన్యాయం జరకుండా 50 శాతం సీట్ల పెంపును ప్రతిపాదించింది. దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకుండా సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని తెలిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కు పెరిగే అవకాశం ఉంది. అనగా దాదాపు 13 సీట్లు పెరుగుతాయని సమాచారం
