ఏపీ

Ap Assembly seats : డీలిమిటేషన్.. ఏపీలో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్రంలోని మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు పలు సవరణలు చేయగా కేంద్ర కేబినెట్ ఇప్పటికే దానికి ఆమోదం తెలిపింది. దీంతో మరోసారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది.దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు 543 నుంచి 850 (రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్రంలోని మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు పలు సవరణలు చేయగా కేంద్ర కేబినెట్ ఇప్పటికే దానికి ఆమోదం తెలిపింది. దీంతో మరోసారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది.దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు 543 నుంచి 850 (రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..

డీలిమిటేషన్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిదే ఏపీలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంటు సీట్లు కూడా పెరుగుతాయి. కేంద్రం ప్రభుత్వం ఈ సారి జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాదికి అన్యాయం జరకుండా 50 శాతం సీట్ల పెంపును ప్రతిపాదించింది. దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకుండా సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని తెలిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కు పెరిగే అవకాశం ఉంది. అనగా దాదాపు 13 సీట్లు పెరుగుతాయని సమాచారం.ఇదే ఫార్ములా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం లోక్‌సభ సీట్లు 195 వరకు చేరే అవకాశం ఉంది.

లోక్‌సభ నియోజకవర్గాల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కో లోక్‌సభ పరిధిలో (సుమారు 5 నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు) పెరిగే చాన్స్ ఉంది.ఈ ప్రకారమే ఏపీ అసెంబ్లీ సీట్లు కూడా గణనీయంగా పెరగనున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 175 నుండి సుమారు 263 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీ రాజకీయ ముఖచిత్రంలో కొత్త నేతలు, యువతకు పెద్దఎత్తున అవకాశాలు లభించనున్నాయి.

డీలిమిటేషన్ బిల్లుతో పాటే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును సైతంపార్లమెంటులో ఆమోదించాలని చూస్తోంది. వీలైతే 2029 జనరల్ ఎలక్షన్‌లోనే మహిళలకు 33శాతం చట్టసభల్లో స్థానం కల్పించేలా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రకారం ఏపీలో 38 పార్లమెంటు సీట్లు, అసెంబ్లీలో 266 సీట్లు పెరిగితే అందులో 33 శాతం మహిళలకు సీట్లు రిజర్వు కానున్నాయి. దీంతో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ సీట్ల శాతం కూడా భారీగా పెరగనున్నట్టు సమాచారం.

ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ స్థానాల పెంపు అంచనా..

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న అసెంబ్లీ స్థానాలు..డీమిలిటేషన్ తర్వాత ఎంత మేర పెరిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

అనంతపురం

పాతవి -14,

కొత్తగా -21

కర్నూల్

పాతవి -14

కొత్తగా -21

వైఎస్సార్ కడప

పాతవి -10

కొత్తగా -15

చిత్తూరు

పాతవి -14

కొత్తగా -21

నెల్లూరు

పాతవి-10

కొత్తగా -15

ప్రకాశం

పాతవి-12

కొత్తగా -18

గుంటూరు

పాతవి-17

కొత్తగా -25

కృష్ణా

పాతవి-16

కొత్తగా -24

పశ్చిమగోదావరి

పాతవి-15

కొత్తగా -22

తూర్పుగోదావరి

పాతవి-19

కొత్తగా-28

విశాఖపట్నం

పాతవి-15

కొత్తగా -23

విజయనగరం

పాతవి-9

కొత్తగా -15

శ్రీకాకుళం

పాతవి-10

కొత్తగా -15

మొత్తం

పాతవి- 175

కొత్తవి- 263

తర్వాత చదవండి