స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Delimitation Bill 2026: బిల్లుకు మద్దతిచ్చేది ఎవరు..? పార్లమెంట్లోనే అసలు పరీక్ష!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ పార్లమెంట్లో బిల్లులు గట్టెక్కుతాయా? అవసరమైన ప్రత్యేక మెజారిటీని ఎన్డీఏ సాధించగలదా? లేక ఏప్రిల్లో ఎదురైన పరాజయం మరోసారి రిపీట్ అవుతుందా..? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన చర్చ. ఈసారి కేంద్రం ముందుకు తెస్తున్న ప్రతిపాదనకు రాజకీయంగా కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్లో బిల్లును వ్యతిరేకించిన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు షరతులతో మద్దతు ఇచ్చే సంకేతాలు ఇస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మాత్రం డీలిమిటేషన్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
