National

Delimitation Bill 2026: డీలిమిటేషన్‌ బిల్లు.. కాంగ్రెస్ పతనానికి దారి తీస్తుందా?

Delimitation Bill 2026: నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026’, రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను దామాషా పద్ధతిలో 50 శాతం పెంచడంతో పాటు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఇండియా కూటమిలోని కీలక ప్రాంతీయ పక్షాలు భిన్న వైఖరిని ప్రదర్శిస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ భవిష్యత్తుకు గట్టి దెబ్బ తీస్తుందా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.