National
Delimitation Bill: డీలిమిటేషన్‌పై కేంద్రం కొత్త ఫార్ములా.. 1971 జనాభా లెక్కలే ఆధారమా?
దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ బిల్లులను సభ ముందుకు తీసుకురానుండగా, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
