National

Delimitation Bill: పార్లమెంట్‌లో మరోసారి డీలిమిటేషన్ వేడి.. ఆ 361 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటేదెలా?

Delimitation Bill: దేశ రాజకీయాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత ఏప్రిల్‌లో సంఖ్యాబలం సరిపోక ఈ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో, ఈసారి లోక్‌సభలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అంటే ఆ 361 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కేంద్రం ఎలా దాటుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.రాజ్యాంగ సవరణ బిల్లు సభలో నెగ్గాలంటే సాధారణ మెజారిటీ సరిపోదు, సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. గత ఏప్రిల్‌లో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి.