తెలంగాణ

Delimitation Bill: డీలిమిటేషన్‌ బిల్లు.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

Delimitation Bill: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్). జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే, జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ పట్టు కోల్పోతాయనే ఆందోళన గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ భయాలన్నింటికీ చెక్ పెడుతూ కొత్త డీలిమిటేషన్ బిల్లు సరికొత్త లెక్కలను తెరపైకి తెస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు ఏకంగా 50 శాతం పెరగబోతున్నాయి.ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ కారణంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచే విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 లోక్‌సభ స్థానాలు కాస్తా ఏకంగా 195కు చేరబోతున్నాయి. అంటే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా (23.76 శాతం) ఏమాత్రం తగ్గకుండా యథాతథంగా కొనసాగుతుంది