DGP CV Anand : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు డీజీపీ సీవీ ఆనంద్..
తెలంగాణతో పాటే దేశవ్యాప్తంగా నమోదయ్యే సైబర్ నేరాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఏఐ(AI)తో పూర్తిగా అప్డేట్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద దీనిని తీర్చిదిద్దుతుండగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో అప్డేట్ అవుతున్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను డిసెంబర్ మొదటి వారంలో డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ ఉదయం పీఎస్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐ అప్డేటేషన్ గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారి ఏఐ టెక్నాలజీతో పోలీస్ స్టేషన్ అప్డేట్ అయ్యాక ఫిర్యాదుల స్వీకరణ, ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు నివేదికలు, కేస్ డైరీలు, ఛార్జ్షీట్ల తయారీ వరకు అన్ని సేవలను ఏఐతో అనుసంధానించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ‘సేతు’ కియోస్క్ ద్వారా 10 భాషల్లో ఫిర్యాదులు స్వీకరించి, వాటిని ఏఐ ద్వారా స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు పంపే సదుపాయం ఉంటుంది.
