National

మాకు తాగడానికే నీళ్లు లేవ్‌.. మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి.. విజయ్‌కు డీకే కౌంటర్

తమిళనాడు, కర్ణాటక మధ్య తాగునీటి కోసం రచ్చ నడుస్తోంది. తమకు కావేరి నది నీళ్లు ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. మా వద్ద నీళ్లు ఉంటే తమిళనాడుకు ఇచ్చేవాళ్లం. అదేమంత పెద్ద కష్టం కాదు. కానీ మాకే తాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు నేను రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆల్రెడీ ఎల్‌ నినో వల్ల పెద్దగా వర్షాలు పడలేదు. వ్యవసాయ సాగుపై నేను ఇప్పటికే రైతులను హెచ్చరించాలి. ఇలాంటి సమయంలో తమిళనాడుకు నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటూ కౌంటర్ వేశారుడ డీకే శివకుమార్.