తమిళనాడు, కర్ణాటక మధ్య తాగునీటి కోసం రచ్చ నడుస్తోంది. తమకు కావేరి నది నీళ్లు ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. మా వద్ద నీళ్లు ఉంటే తమిళనాడుకు ఇచ్చేవాళ్లం. అదేమంత పెద్ద కష్టం కాదు. కానీ మాకే తాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు నేను రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆల్రెడీ ఎల్ నినో వల్ల పెద్దగా వర్షాలు పడలేదు. వ్యవసాయ సాగుపై నేను ఇప్పటికే రైతులను హెచ్చరించాలి. ఇలాంటి సమయంలో తమిళనాడుకు నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటూ కౌంటర్ వేశారుడ డీకే శివకుమార్.
నీటి ఎద్దడి కారణంగా కావేరి ఆనవాయితీగా చేసే బాగిన సమర్పణనను కూడా నిర్వహించలేని దారుణమైన పరిస్థితి ఉందన్నారు. దీంతో పాటు కావేరి నది నీటి వివాదం, మేకెదాటు ప్రాజెక్టుపై కాంగ్రెస్ సీనియర్ లీడర్లు చేస్తున్న కామెంట్లపై డీకే స్పందించారు. కొందరు మిత్రులు తెలిసి, తెలియక మాట్లాడుతున్నారని, వాటిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వివరణ ఇస్తామని చెప్పారు. త్వరలోనే నీటి వివాదాలను పరిష్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, రైతులకు అన్ని విధాలుగా అండగానిలుస్తామన్నారు. ఎల్ నినో వల్ల దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి ఉందని, కాబట్టి ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.
