National

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, శరద్ పవార్ ఎన్సీపీ మద్దతు.. ఇండియా కూటమికి వరుస షాక్‌లు!

 నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు (Delimitation Bill) శరద్ పవార్ (SharadPawar) నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)తో పాటు డీఎం(DMK)కే కూడా మద్దతు ప్రకటించడంతో దేశ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకునేందుకు మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరమైన నేపథ్యంలో, ఈ రెండు పార్టీల నిర్ణయం అధికార పక్షానికి బలాన్ని చేకూర్చింది. ఇదే అంశంపై శరద్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫోన్ చేసి బిల్లుకు మద్దతు ఇవ్వడం అత్యవసరమని స్పష్టం చేయగా, ఎన్సీపీ నిర్ణయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.