Health
Health Tips : నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? మీరు డేంజర్లో ఉన్నట్టే?
ఆధునిక జీవన శైలి(Lifestyle)లో చాలా మంది ఒత్తిడితో కూడిన జీవనాన్ని గడుపుతున్నారు. ఫలితంగా రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర కూడా పోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పట్టడం లేదని చాలా మంది ఆస్పత్రికి వెళ్తున్నారని, మరికొందరు రాత్రిళ్లు నిద్రలో పదే పదే మెలకువ వస్తోందని కోర్సు తీసుకుంటున్నట్టు సమాచారం. అసలు ఇలా ఎందుకు అవుతుంది? అందుకు గల కారణాలు ఏమిటి? నిద్రలో మెలకువ రావడం సాధారణ సమస్యే అయినప్పటికీ ఇది దీర్ఘకాలం కొనసాగితే అశ్రద్ధ వహించరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా, మన దైనందిన అలవాట్లు, మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణాలు కావచ్చని స్పష్టంచేశారు.
