తెలంగాణ
చట్టసభల్లో బీసీలకు 27శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
Eatala Rajendar: చట్టసభల్లో ఓబీసీలు, బీసీలకు రాజ్యాంగబద్ధంగా 27శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీసీల చిరకాల డిమాండ్లు సంపూర్ణంగా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం అక్కడక్కడ విద్య, ఉద్యోగ సంస్థల్లో రిజర్వేషన్ల అమల్లో లోపాలు తలెత్తినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి సాధించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
