క్రైమ్

Rekha Naik ED Raid: మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు దాడులు!

 నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు అజ్మీరా రేఖా నాయక్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. మొత్తం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ. 40.96 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం అక్రమాల కేసుకు సంబంధించి ఈడీ బృందాలు రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం 6 గంటల నుంచే అధికారుల బృందాలు ఆమె నివాసానికి చేరుకుని కీలక ఆర్థిక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.