వ్యాపారం

Electric Blanket Risks: ఎలక్ట్రిక్ బ్లాంకెట్ వాడేవాళ్లకు బిగ్ అలర్ట్.. ఈ 5 పొరపాట్లు చేస్తే షాక్ కొట్టడం ఖాయం!

Electric Blanket Risks: చలికాలం వచ్చిందంటే చాలు.. వణుకు పుట్టించే చలి నుంచి తప్పించుకోవడానికి రగ్గులు, రూమ్ హీటర్లతో పాటు ఈ మధ్య 'ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు' కూడా బాగా వాడుతున్నారు. ప్లగ్ పెడితే చాలు.. లోపల ఉండే హీటింగ్ వైర్ల వల్ల దుప్పటి నిమిషాల్లో వెచ్చగా మారిపోతుంది. మంచం మీద పరుచుకునేవి, ఒంటిపై కప్పుకునేవి ఇలా రకరకాల మోడళ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే, ఇవి ఎంత వెచ్చదనాన్ని ఇస్తాయో.. వాడకంలో చిన్న అజాగ్రత్త జరిగినా అంతే పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ దుప్పటి వాడేటప్పుడు ఈ 5 పొరపాట్లు చేస్తే కరెంట్ షాక్ కొట్టడం, చర్మం కాలిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు అంటుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఐదు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.