తెలంగాణ

Etela Rajender: ఈటల పాదయాత్ర.. బ్రేకులు వేస్తున్న రాష్ట్ర నేతలు

Etela Rajender: తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నేతలు పాదయాత్రల బాట పడుతుండగా, మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ వేస్తున్న కొత్త అడుగులు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రతిపాదనకు ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా, రాష్ట్ర స్థాయి నేతల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపు సహా స్థానిక సమస్యలపై మల్కాజగిరి పార్లమెంట్ పరిధిలో ఈటల రాజేందర్ నాలుగు రోజుల పాటు సుమారు 60 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా, జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.