తెలంగాణ

21ఏళ్ల తర్వాత.. జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు.. నవ్వులే నవ్వులు..

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీమంత్రి హరీశ్ రావు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన సందడి చేశారు. ఇటీవలే జగ్గారెడ్డి కుమారుడి వివాహం జరిగింది. నూతన వధూవరులను హరీశ్ రావు ఆశీర్వదించారు. జగ్గారెడ్డి ఇంటికి వెళ్లిన హరీశ్ రావు అక్కడ సందడి చేశారు. రాజకీయ ప్రత్యర్థులం అనే విషయాన్ని పక్కన పెట్టి ఇద్దరూ కలిసిపోయారు. పక్కపక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.