తెలంగాణ

Harish Rao: 21ఏళ్ల తర్వాత.. జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు.. ఇద్దరి మధ్య సరదా సంభాషణ

Harish Rao: 2004లో హరీశ్ రావు ఛాంబర్ లో కలిసి భోజనం చేసేవాళ్లమని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ లో చేరాక పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా వ్యక్తిగతంగా కలవలేదని తెలిపారు.

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీమంత్రి హరీశ్ రావు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన సందడి చేశారు. ఇటీవలే జగ్గారెడ్డి కుమారుడి వివాహం జరిగింది. నూతన వధూవరులను హరీశ్ రావు ఆశీర్వదించారు. జగ్గారెడ్డి ఇంటికి (Jagga Reddy House) వెళ్లిన హరీశ్ రావు అక్కడ సందడి చేశారు. రాజకీయ ప్రత్యర్థులం అనే విషయాన్ని పక్కన పెట్టి ఇద్దరూ కలిసిపోయారు. పక్కపక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

నేను, హరీశ్ కలిసి భోజనం చేసేవాళ్లం

2004లో హరీశ్ రావు ఛాంబర్ లో కలిసి భోజనం చేసేవాళ్లమని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ లో చేరాక పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా వ్యక్తిగతంగా కలవలేదని తెలిపారు. తాజా భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హరీశ్ రావు, జగ్గారెడ్డి పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, 21ఏళ్ల తర్వాత హరీశ్ రావు (Harish Rao) తనను కలిశారని జగ్గారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు.

కూతురి పెళ్లికి హరీశ్ ని పిలవలేకపోయాను

''2004లో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి.. ఆయన ఛాంబర్ లో భోజనం చేసే వాళ్ళం. ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో (Congress) వచ్చాక.. మళ్ళీ ఇప్పటివరకు హరీశ్ ని కలవలేదు. 21ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిశాము. కూతురి పెళ్లికి హరీష్ రావుని పిలవలేకపోయాను. కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను.

మా ఇద్దరి కలయికలో రాజకీయాలు లేవు

మా ఇద్దరి కలయికలో ఎటువంటి రాజకీయాలు (Politics) లేవు.. మా కలయికలో ఎటువంటి మతలబు లేదు.. రాజకీయం...రాజకీయమే.. హరీష్ రావు BRS లో అగ్రనేత.. నేను కాంగ్రెస్ లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్ నే.. అనేక ఫంక్షన్లకు ఆయన్ని పిలవలేకపోయాను. పదేళ్లు హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు'' అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి.

తర్వాత చదవండి