తెలంగాణ

చంద్రబాబు అబద్ధాలకు అంతే లేదు

ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగదీశ్ రెడ్డి. చంద్రబాబు అబద్ధాలకు అంతే లేదు అని ధ్వజమెత్తారు. 3 నెలల్లో 30 లక్షల మంది 9 TMCల నీళ్లు తాగుతున్నారంటే.. ఇంతకుమించిన అబద్ధం ఇంకొకటి ఉండదన్నారు. మరి.. రెండున్నర కోట్ల మంది ఉన్న మేము సంవత్సరం పాటు ఎలా బతకాలి? హైదరాబాద్ నగర పరిస్థితి ఏంటి? హైదరాబాద్ సహా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.