క్రైమ్
Actor anitha : సైబర్ వలలో సినీ యాక్టర్ అనిత.. రూ.లక్షలు మాయం!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మాస్క్ వేసుకుని అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు కొంత తగ్గుముఖం పట్టాయని పోలీసులు ఇటీవల ప్రకటించారు. కానీ, ఆ మోసాలు మళ్లీ తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినిపించుకోవడం లేదు. ఓ సినీ నటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుకున్నారు. విమాన టికెట్ పేరిట సినీ యాక్టర్ అనితను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.4 లక్షలు కాజేశారు. దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురయ్యి పోలీసులను ఆశ్రయించారు.
