తెలంగాణ

ఈ నగరానికి ఏమైంది..? బిర్యానీలో బొద్దింక.. స్వీట్లలో కల్తీ! హోటల్‌కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి

రెస్టారెంట్‌లో బిర్యానీ ఆర్డర్ చేశారు. ఫుడ్ వచ్చింది. వేడివేడి బిర్యానీ.. పక్కన చికెన్ పీస్‌లు.. మంచి సువాసన. ఇంకేముంది.. లాగించేయడమే! కానీ ఒక్కసారి ఆగండి. ఆ బిర్యానీ తయారైన వంటగదిలో ఏం జరిగింది? అందులో వాడిన మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? వంట చేసిన వ్యక్తి పరిశుభ్రత పాటించారా?