తెలంగాణ

రూ.60 లక్షల విలువైన ఇల్లు.. ఉచితంగా రిజిస్ట్రేషన్

Indiramma Towers: హైదరాబాద్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా)లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదవడం విశేషం.

రెరా రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మరింత భరోసా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని పారదర్శకంగా చేపట్టడంతో పాటు, లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల అప్పగింత వరకు ప్రతి దశలో జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. రెరా రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మరింత భరోసా కలగనుంది. నిర్మాణంలో జాప్యం జరిగినా, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నా రెరాను ఆశ్రయించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.